Header Banner

ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నిరాకరించింది! ఒప్పందం పొడిగించడాన్ని తిరస్కరించడంతో...!

  Sun Mar 02, 2025 17:24        Others

తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి హమాస్ నిరాకరించింది. దీంతో గాజాకు పంపే అంతర్జాతీయ మానవతా సహాయాన్ని అడ్డుకుంటున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ ఇకపై గాజాలోకి ఎటువంటి వస్తువులను అనుమతించదని ఇజ్రెయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

 

ఇది కూడా చదవండి: దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

 

ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైన సమయంలో ఈ నిర్ణయం వచ్చింది. దీనికి కారణం కాల్పుల విరమణను పొడిగించడానికి హమాస్ నిరాకరించడమేనని.. ఇజ్రాయెల్ తన బందీలను విడుదల చేయకుండా పూర్తి స్థాయి కాల్పుల విరమణను అనుమతించదని ప్రధాన మంత్రి నెతన్యాహు అన్నారు. కాల్పుల విరమణను పొడిగించాలన్న అమెరికా ప్రతిపాదనను హమాస్ అంగీకరించకపోతే మరిన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఆయన హెచ్చరించారు.

 

ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని హమాస్ ఆరోపించింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం శనివారం ముగిసింది. ఇటీవల ఈజిప్టు, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఈ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఇందులో మానవతా సహాయం పెరిగింది. ఈ క్రమంలోనే రంజాన్ సందర్భంగా తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 వరకు పొడిగించాలని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కోఫ్ ప్రతిపాదించారు. దీనిలో భాగంగా హమాస్ తమ ఆధీనంలోని పలువురు బందీలను విడుదల చేయాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ వెల్లడించింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

దీనికి హమాస్ నిరాకరించడంతో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ తన దళాలను ఉపసంహరించుకుని శాశ్వత కాల్పుల విరమణకు బదులుగా హమాస్ డజన్ల కొద్దీ మిగిలిన బందీలను విడుదల చేసే రెండో దశపై ఇరు పక్షాలు ఇంకా చర్చలు జరపలేదు. రెండో దశ కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు కైరోలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Israel #Hamas #CeasefireAgreement #Gaza #HumanitarianAid #MiddleEastConflict #IsraelHamasConflict #CeasefireExtension #PeaceTalks #Ramadan #InternationalDiplomacy